స్వేచ్ఛగా మాట్లాడండి

విభిన్నమైన సందేశ అనుభవానికి "హలో" అని చెప్పండి. మీరు ఆశించే అన్ని ఫీచర్లతో కలిపి, గోప్యతపై ఊహించని దృష్టి.


Signal ను పొందండి

Signal ను ఎందుకు ఉపయోగించాలి?

Signal ఎందుకు సరళమైన, శక్తివంతమైన మరియు సురక్షితమైన మెసెంజర్ అని చూడటానికి క్రింద అన్వేషించండి

అభద్రత లేకుండా పంచుకోండి

స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ (ఓపెన్ సోర్స్ Signal ప్రోటోకాల్ చేత ఆధారితం) మీ సంభాషణలను సురక్షితంగా ఉంచుతుంది. మేము మీ సందేశాలను చదవలేము లేదా మీ కాల్‌లను వినలేము మరియు మరెవరూ చేయలేరు. గోప్యత ఐచ్ఛిక మోడ్ కాదు — ఇది Signal పనిచేసే మార్గం. ప్రతి సందేశం, ప్రతి కాల్, ప్రతిసారీ.

ఏదో ఒకటి చెప్పండి

టెక్స్ట్, ధ్వని సందేశాలు, ఫోటోలు, వీడియోలు, GIF లు మరియు ఫైళ్ళను ఉచితంగా పంచుకోండి. Signal మీ ఫోన్ యొక్క డేటా కనెక్షన్‌ను ఉపయోగిస్తుంది కాబట్టి మీరు SMS మరియు MMS రుసుములను నివారించవచ్చు.

స్వేచ్ఛగా మాట్లాడండి

సుదూర ఛార్జీలు లేకుండా, పట్టణం అంతటా లేదా సముద్రం అంతటా నివసించే ప్రజలకు సుస్పష్టమైన ధ్వని మరియు వీడియో కాల్స్ చేయండి.

గోప్యతను శాశ్వతంగా ఉండిపోయేలా చేయండి

ఎన్‌క్రిప్ట్ చేయబడిన స్టిక్కర్లతో మీ సంభాషణలకు వ్యక్తీకరణ యొక్క కొత్త పొరను జోడించండి. మీరు మీ స్వంత స్టిక్కర్ ప్యాక్‌లను కూడా సృష్టించవచ్చు మరియు పంచుకోవచ్చు.

గ్రూపులతో కలిసి ఉండండి

గ్రూప్ చాట్స్ మీ కుటుంబం, స్నేహితులు మరియు సహోద్యోగులతో అనుసంధానం అయి ఉండటానికి సులభం చేస్తాయి.

ప్రకటనలు లేవు. ట్రాకర్లు లేవు. తమాషా అసలే కాదు.

Signal లో ప్రకటనలు లేవు, అనుబంధ అమ్మకందారులు లేరు మరియు గగుర్పాటు కలిగించే ట్రాకింగ్ లేదు. కాబట్టి మీకు ముఖ్యమైన వ్యక్తులతో వారికి ముఖ్యమైన క్షణాలను పంచుకోవడంపై దృష్టి పెట్టండి.

ప్రతిఒక్కరికీ ఉచితం

Signal స్వతంత్ర లాభాపేక్షలేనిది. మేము ఏ పెద్ద టెక్ కంపెనీలతోనూ ముడిపడి లేము, మరియు మమ్మల్ని ఎప్పటికీ ఎవరూ పొందలేరు. మీలాంటి వ్యక్తుల నుండి వచ్చే గ్రాంట్లు మరియు విరాళాల ద్వారా అభివృద్ధికి మద్దతు ఉంది.

Signal కు విరాళం ఇవ్వండి